Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఆహారంతో కరోనాకు చెక్..

ఈ ఆహారం రోగనిరోధకం!

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితంగా కోలుకోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. ఇందుకోసం  ఆ వ్యవస్థను పటిష్ఠంగా మార్చే పోషకాలు తీసుకోవాలి. 


ప్రొటీన్‌: మాంసం, చికెన్‌, గుడ్లు, చేపలు, పెరుగు, పాలు, జున్ను, అన్ని రకాల పప్పుదినుసులు, అన్ని రకాల బీన్స్‌.

‘సి’ విటమిన్‌: తాజా పళ్లు, కూరగాయలు (సలాడ్లు, పాలకూర, క్యాప్సికం). బొప్పాయి, నిమ్మజాతి పళ్లు, స్ట్రాబెర్రీ.

‘ఎ’ విటమిన్‌: క్యారెట్స్‌, తియ్య దోస, బొప్పాయి, గుమ్మడి, ఆకుకూరలు.

‘డి’ విటమిన్‌: ప్రతి రోజూ 20 నిమిషాలు ఎండ తగిలేలా చూసుకోవాలి.

‘ఇ’ విటమిన్‌: ఇన్‌ఫెక్షన్లతో పోరాడగల బలవర్ధకమైన విటమిన్‌ ఇది. బాదం, వేరుసెనగపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పిస్తాలలో ఇది పుష్కలంగా లభిస్తుంది. 

ఫోలిక్‌ యాసిడ్‌: ఆకుకూరలు, బీన్స్‌, నిమ్మజాతి పళ్లు.

ఐరన్‌: ఆకుకూరలు, బీన్స్‌, లివర్‌.

సెలీనియం: గుడ్లు, బ్రౌన్‌ రైస్‌, బీన్స్‌, పుట్టగొడుగులు, ఓట్స్‌, పాలకూర, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, అరటిపళ్లు.

జింక్‌: చిక్కుళ్లు, విత్తనాలు, నట్స్‌, పాల ఉత్పత్తులు, గుడ్లు.

అల్లం: దీన్లో రోగనిరోధక వ్యవస్థను బలపరిచే గుణాలు ఉంటాయి. కాబట్టి ఆహారంలో ఎక్కువగా వాడుతూ ఉండాలి.

పాలకూర: ఆవిరి మీద ఉడికించి లేదాఉడకబెట్టి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

పెరుగు: పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యవంతమైన పేగులు రోగనిరోధకశక్తిని బలపరుస్తాయి.

బాదం: వీటిలో పోషకాలు ఎక్కువ. కాబట్టి రోజుకు 10 బాదం పప్పులు తింటే ఫలితం ఉంటుంది.

పసుపు: రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి పసుపు తోడ్పడుతుంది. అయుతే దీన్ని మిరియాలు, స్వచ్ఛమైన నెయ్యి లేదా కొబ్బరి నూనెలతో కలిపి తీసుకోవాలి. అప్పుడే పసుపును శరీరం పూర్తిగా శోషించుకుంటుంది. ఇందుకోసం అర చెంచా పసుపునకు చెంచా నెయ్యి లేదా కొబ్బరినూనె, చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.

గ్రీన్‌ టీ: రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగడం మేలు.


- డాక్టర్‌ లహరి సూరపనేని,

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...