ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-25T05:56:21+05:30 IST

జగ్గంపేటరూరల్‌, మే 24: రాజపూడి, మల్లిశాల వెంగాయమ్మపురం గ్రామాల్లో తాండ్ర పరిశ్రమలపై మంగళవారం అసిస్టెంట్‌ ఫుడ్‌కంట్రోలర్‌ శ్రీనివాస్‌ సిబ్బందితో తనిఖీలు చేసి శ్యాంపిల్‌ సేకరించారు. నాణ్యతా ప్రమాణాలపై పరిశీలించారు. అక్కడ కుళ్లిపోయిన పండ్లను చూసి పరిశ్రమ యజమా

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

జగ్గంపేటరూరల్‌, మే 24: రాజపూడి, మల్లిశాల వెంగాయమ్మపురం గ్రామాల్లో తాండ్ర పరిశ్రమలపై మంగళవారం అసిస్టెంట్‌ ఫుడ్‌కంట్రోలర్‌ శ్రీనివాస్‌ సిబ్బందితో తనిఖీలు చేసి శ్యాంపిల్‌ సేకరించారు. నాణ్యతా ప్రమాణాలపై పరిశీలించారు. అక్కడ కుళ్లిపోయిన పండ్లను చూసి పరిశ్రమ యజమానులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోను కుళ్లినపండ్లను ఉపయోగించరాదన్నారు. మామిడిపండ్ల నుంచి గుజ్జు తీసిన తరువాత పరిమిత మోతాదులో సిట్రిక్‌ యాసిడ్‌,  పొటాషియం, బైసెల్ఫేట్‌ కలపాలన్నారు. శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపుతామని వచ్చిన రిపోర్టుల ఆధారంగా పరిశ్రమలపై చర్యలు ఉంటాయని, మోతాదుకు మించితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.




Updated Date - 2022-05-25T05:56:21+05:30 IST