అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు

ABN , First Publish Date - 2021-07-27T06:17:56+05:30 IST

పేదల సంక్షేమం, అభివృద్ధియే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు పర్చడం జరుగుతోందని రాష్ట్ర శాసన సభాపతి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ

అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు
బాన్సువాడలో నూతన ఆహార భద్రత కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

- డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కూడా అందజేస్తాం 

- అనర్హులు తమ తెల్ల రేషన్‌ కార్డులను తిరిగి  స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో అందజేయాలి 

- బాన్సువాడలో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

బాన్సువాడ, జూలై 26: పేదల సంక్షేమం, అభివృద్ధియే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు పర్చడం జరుగుతోందని రాష్ట్ర శాసన సభాపతి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు గాను 87లక్షల 33వేల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులున్నాయని, అందులో సుమారు 2కోట్ల 70 లక్ష ల మంది లబ్ధిదారులున్నారన్నారు. కుటుంబంలో అందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం చొప్పున ప్రభుత్వం అందజేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు పంపిణీలో భాగంగా ఒక్కరోజే 3 లక్షల 98 వేల తెల్లరేషన్‌ కార్డులు అందించడం జరిగిందని, అందులో 8లక్షల 70వేల మంది కి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. బాన్సువాడ పట్టణంలో 8వేల 265 కుటుంబా లుండగా, ఇప్పటికీ 6వేల 535కార్డులున్నాయని, నూతనంగా 199 కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, 6727 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల వారీగా 11240 కుటుంబాలలో ఇప్పటికే 10,420 కుటుంబాలకు కార్డులున్నాయని, నూతనంగా 156 కొత్త కార్డులు అందించ డం జరిగిందన్నారు. మొత్తం మీదుగా 94.1 శాతం రేషన్‌ కార్డులున్నాయన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారందరికీ డబుల్‌ ఇళ్లు కట్టించి తీరుతామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా సంకల్పమన్నారు. తెల్ల రేషన్‌ కార్డు ఉండి ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్వచ్ఛందంగా రెవెన్యూ కార్యాలయంలో రేషన్‌ కార్డులను తిరిగి ఇవ్వాలని ఆయన అన్నారు. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఏ పేదవారు కూడా ప్రభుత్వ పథకాలను పొందకుండా ఉన్నవారిని గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అర్హులందరికీ పథకాలను అందజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, ఎఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, మండలాధ్యక్షులు మోహన్‌ నాయక్‌, జడ్పీటీసీ పద్మా గోపాల్‌ రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతిఽనిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పేదవారి కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయం 

బీర్కూర్‌/నస్రుల్లాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల కడుపు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లోని అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను అందజేశారు. బీర్కూర్‌లోని ఎఆర్‌ గార్డెన్‌లో, నస్రుల్లాబాద్‌లోని రైతు వేదిక భవనంలో పేదలకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద ప్రజల అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అలాగే ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జీ పోచారం సురేందర్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, ఎంపీపీలు రఘు, పాల్త్య విఠల్‌, ఎఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, మైలారం సొసైటీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, రాజు, తదితరులున్నారు.  

Updated Date - 2021-07-27T06:17:56+05:30 IST