అంకాపూర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

ABN , First Publish Date - 2021-06-09T04:56:18+05:30 IST

జిల్లాలో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు అం కాపూర్‌ ను ఎంపిక చేశారు. ఈ గ్రామంలో దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో అనుమతులను ఇస్తున్నారు.

అంకాపూర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

గ్రామంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిన అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు అం కాపూర్‌ ను ఎంపిక చేశారు. ఈ గ్రామంలో దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో అనుమతులను ఇస్తున్నారు. రెవెన్యూ భూమిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థకు అ ప్పగిస్తున్నారు. జిల్లాలో పండించే పంటల ఆధారంగా ఈ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. మెంట్రాజ్‌పల్లిలోనూ భూమిని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూమి కొంత ఉండ డంతో అసైన్డ్‌ భూమి కొంత తీసుకునే యోచనలో ఉన్నా రు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జో న్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. త్వరగా భూమిని సేకరి ంచి నివేదికలు పంపాలని నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆదేశించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అంకాపూర్‌లో ప్రభుత్వ భూమి అందు బాటులో ఉండడంతో దానిని కేటాయిస్తున్నారు. గ్రామాన్ని ఆనుకొని ఉన్న గుట్ట పక్కన ఈ భూమి అందుబాటులో ఉండడంతో అధికారులు సర్వే చేపట్టారు. ఆ భూమి వివరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థకు అం దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారుల పక్కన స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు అనువు గా ఉంటుందని నిర్ధారించారు. 100 ఎకరాల ప్రభుత్వ భూ మే కావడం వల్ల భూసేకరణ ఉండకపోవడంతో ఈ భూ ములను ఎంపిక చేశారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో కూడా మరో వంద ఎకరాలను పరిశీలిస్తున్నారు. ఇ క్కడ 70ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా.. మరో 30 ఎకరాల వరకు అసైన్డ్‌ భూమి ఉండడంతో ఆ భూము ల వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట అంకాపూర్‌ భూ ముల వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఒక టి, రెండు రోజులలో ఇండస్ర్టియల్‌ కార్పొరేషన్‌ అధికారులకు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చే స్తున్నారు. గత నెలలోనే ఈ భూములపై సర్వే నిర్వహించారు. భూమి పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నట్లు అధి కారులు నిర్ధారించారు. మట్టి నమూనాలు, నీటి లభ్యత ఆ ధారంగా ఎంపిక చేశారు. అంకాపూర్‌ గ్రామం పక్కనే స్పె షల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తే విజయవంతం అవుతుందని అధికారులు భావించి ఈ భూములను కేటాయించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థకు భూమిని ఇవ్వగానే మొదట అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థకు కేటాయిస్తారు. జిల్లాలో మొక్కజొన్న, పసుపు, సోయా, జొన్న, వరి ఎక్కువగా పండుతుండడం వల్ల వీటికి సంబంధించిన పరిశ్రమలకు ఈ భూ ములను కేటాయిస్తారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వీటిని ప్రోత్సహిస్తారు. రాష్ట్రంనుంచే కాకు ండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ  ఆదేశాల మేరకు మొదట అంకాపూర్‌ను ఎంపిక చేశామని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సం స్థ జిల్లా అధికారి దినేష్‌ తెలిపారు. ఈ భూములను అప్ప గించగానే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

Updated Date - 2021-06-09T04:56:18+05:30 IST