శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న చైర్మన్
నిర్మల్ కల్చరల్, నవంబరు 28 : నిర్మల్ పట్టణ మున్సిపల్ పరిధిలో 5వ వార్డు బంగల్‌పేట్ బోయివాడలో శనివారం చైర్మన్ జి. ఈశ్వర్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ దశల వారిగా అన్ని వార్డుల్లో రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కమిషనర్ బాలకృష్ణ, ఏఈ వినయ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.