గాంధీజీ బాటలో నడవాలి

ABN , First Publish Date - 2022-10-03T05:33:46+05:30 IST

జాతిపిత మహాత్మగాంధీ బాటలో నడువాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ అన్నారు.

గాంధీజీ బాటలో నడవాలి
గాంధీకి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 2 : జాతిపిత మహాత్మగాంధీ బాటలో నడువాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ అన్నారు. ఆది వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వ హించిన గాంధీ జయంతి కార్యక్రమంలో కలెక్ట ర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, అదనపు క లెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి పాల్గొని జ్యోతిప్ర జ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాల ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గాంధీ చూపిన బాటలో నడువాలన్నారు. సత్యం, అహింసతో ప్రపంచా నికి కొత్తదారి చూపిన మహాత్ముడని, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సం దర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల్లో గాం ధీ జీవితం, సిద్ధాంతాల గురించి తెలిసే విధం గా ప్రతిజిల్లాలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించిం దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారు లు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:33:46+05:30 IST