నిబంధనలు పాటించండి

ABN , First Publish Date - 2021-01-27T06:23:20+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధ నలను తు.చ. తప్పక పాటించి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను పార ద్శకంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అథా రిటీ వీరపాండియన్‌ ఆదేశించారు.

నిబంధనలు పాటించండి

  1.  పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించండి
  2.  అధికారులతో కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు (కలెక్టరేట్‌), జనవరి 26 : రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధ నలను తు.చ. తప్పక పాటించి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను పార ద్శకంగా నిర్వహించాలని  జిల్లా అధికారులను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అథా రిటీ వీరపాండియన్‌ ఆదేశించారు. మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడు కల అనంతరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు, నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్వేచ్ఛాయుత వాతావరణంలో  ఓటు హక్కును వినియోగించుకునే వాతావ రణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 29న తొలి విడతగా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో 12 మండలాల్లో 193 గ్రామపంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్‌, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. రెండవ ఫేజ్‌లో నంద్యాల, కర్నూలు రెవిన్యూ డివిజన్లలో 13 మండలాల్లోని 240 గ్రామ పంచాయ తీలకు ఎన్నికలు, మూడో  ఫేజ్‌లో కర్నూలు, ఆదోని రెవిన్యూ డివిజన్లలో 14 మండలాల్లో 245 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు, నాల్గవ ఫేజ్‌లో ఆదోని రెవెన్యూ డివిజన్‌లో 14 మండలాల్లోని 292 గ్రామ పంచాయతీలకు ఎన్ని కలు జరుగుతాయన్నారు. ఈనెల 27న (బుధవారం )ఉదయం జిల్లా కలె క్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, డిపీవోలు, జడ్పీ సీఈవోలు తదితర ఎన్నికల అధికారులతో ఎస్‌.ఈ.సీ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తు న్నారన్నారు. జిల్లాలో దాదాపు 970కి పైగా గ్రామ పంచాయతీలలో 4 దశ లలో అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన  రిట ర్నింగ్‌, సహాయ రిట ర్నింగ్‌ అధికారులు, రూ ట్‌, జోన్‌/సెక్టోరల్‌ అధి కారులు, పీ.వో.లు, ఓపీ వోల నియామకం, వారి కి శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల పరిస్థితి, పోలింగ్‌ కేం ద్రాల పరిస్థితి, సమస్యా త్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, మోడల్‌ కోడ్‌ అమలు టీమ్స్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, చెక్‌ పోస్టులలో స్టాటిక్‌ నిఘా టీమ్స్‌ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల ఎన్ని కల నిర్వహణ కోసం 10200 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించామన్నారు.  మండల అధికారులు పోలింగ్‌ కేంద్రాల తనిఖీని మరో మారు చేపట్టాలని కలెక్టర్‌ ఆదే శించారు. జిల్లాలో 970 మంది గెజిటెడ్‌ స్టేజి-1 ఆరో.వోలను, అవసరమైనంత మంది ఏ.ఆర్వోలను, సుమారు 1200 మంది పీ.వోలు, 30,000ల మంది సిబ్బందిని, 25 శాతం రిజర్వుతో నియమించాలని అధికారులను ఆదేశించారు.   అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నిబం ధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్లు రామ సుందరరెడ్డి, ఖాజామోహిద్దీన్‌, నంద్యాల సబ్‌  కలెక్టర్‌ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధిమీనా, డీఆర్వో పుల్లయ్య, ఆర్డీవోలు వెంకటేష్‌, రామ కృష్ణారెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, సమాచార శాఖ డీడీ తిమ్మప్ప,  పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:23:20+05:30 IST