Advertisement
Advertisement
Abn logo
Advertisement

జానపద కళలను ప్రోత్సహించాలి

హుజూర్‌నగర్‌ , నవంబరు 29: ప్రభుత్వం జానపద కళలను ప్రోత్సహించాలని  ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజానాట్యమండలి జిల్లా మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సాంస్కృతిక శాఖకు రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. సాంస్కృతిక సారథి శాఖలో కొత్తగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఇప్పటివరకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో సంగీత నాట్యాచారులను నియమించాలన్నారు. కళాకారులను గుర్తించి ప్రభుత్వం గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు కళాకారులకు పింఛన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అంతరిస్తున్న జానపదకళలను ప్రోత్సహించాలన్నారు. పండుగలు, జాతరల సందర్భంగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు పాలకూరి బాబు గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్‌, బాదె నర్సయ్య, దొంతగాని సత్యనారాయణ, ధనుంజయనాయుడు, రమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement