Abn logo
Aug 4 2021 @ 00:04AM

జీసీసీ అభివృద్ధిపై దృష్టి సారించండి

నిర్మాణంలో ఉన్న జీఎం కార్యాలయాన్ని పరిశీలిస్తున్న శోభ


 సంస్థ ఎండీ పీఏ శోభ 


సీతంపేట: అటవీ ఉత్పత్తులను సేకరించి జీసీసీ  అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ సంస్థ ఎండీ పీఏ శోభ తెలిపారు. మంగళవారం సీతంపేటలోని జీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా శోభ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న డివిజినల్‌ కార్యాలయ  భవన సముదా యాన్ని త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. కొత్తూరులో  ఉన్న జీసీసీ స్థలంలో షాపింగ్‌కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు.  సీతంపేటలోని సూపర్‌బజారును తెరిచి వ్యాపారా భివృద్ధి చేయాలన్నారు. ఆమె వెంట జీసీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ చిన్నబాబు, జీఎం శ్రీరాములు, మేనేజర్‌ నరసింహులు పాల్గొన్నారు.