ఫ్లైఓవర్‌ నిర్మించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:17:47+05:30 IST

మండలంలోని ఇడమడక మెట్ట వద్ద 40వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ను నిర్మించాలని, సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని శుక్రవారం సాయంత్రం రైతులు ఆందోళన చేశారు.

ఫ్లైఓవర్‌ నిర్మించాలి
జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్థులు

  1. జాతీయ రహదారిపై గ్రామస్థుల ఆందోళన


చాగలమర్రి, ఏప్రిల్‌ 16: మండలంలోని ఇడమడక మెట్ట వద్ద 40వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ను నిర్మించాలని, సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని శుక్రవారం సాయంత్రం రైతులు ఆందోళన చేశారు. ఇడమడక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా మృతి చెందారు. గతంలో కూడా పలువురు మృతి చెందిన హైవే అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు రహదారిని దిగ్బంధం చేశారు. కర్నూలు, కడప జిల్లాల వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.   పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో శాంతించారు.


 చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం

 మండలంలోని ఇడమడకమెట్ట వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డిప్యూటీ సీఎం హమ్‌జాద్‌బాషా శుక్రవారం రాత్రి అన్నారు. ఇడమడక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయంలో గ్రామస్థులు హైవే దిగ్బంధిం చిన విషయాన్ని తెలుసుకొని డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్లి గ్రామస్థులతో చర్చించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఉన్నారు. 

Updated Date - 2021-04-17T05:17:47+05:30 IST