Abn logo
Oct 16 2021 @ 23:48PM

మడ్డువలసకు చేరిన వరద నీరు

మూడు గేట్ల ద్వారా విడుదల చేసిన నీరు

మూడు గేట్ల ద్వారా విడుదల

వంగర, అక్టోబరు 16:  తుఫాన్‌ కారణంగా మడ్డువలస రిజర్వాయర్‌ పరిసరాలతో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీరు చేరింది. ఈ నదుల ద్వారా నీరు ఎక్కువగా మడ్డువలస రిజర్వాయర్‌లోకి రావడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు ప్రధాన గేట్లను ఎత్తి నాగావళి నదికి నీటిని విదుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 64.50 మీటర్లు కాగా శనివారం ఉదయానికి 64.75 మీటర్లకి పెరిగింది. దీంతో అధికారులు మూడు గేట్ల ద్వారా 6,250 క్యూసె క్కుల నీరు విడుదల చేశారు. రెండు నదుల ద్వా రా ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు రాగా అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో కొండ చాకరాపల్లి, కొప్పర గ్రామాలు ముంచేయడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని  ఏఈ నితిన్‌ తెలి పారు. ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గినట్లు చెప్పారు. కాలు వల ద్వారా కూడా పంట భూములకు నీరు నిలుపుదల చేసినట్లు వివరించారు.