Abn logo
Jul 29 2021 @ 19:57PM

పులిచింతలకు భారీగా చేరుతున్న వరద నీరు

సూర్యాపేట: పులిచింతలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక గేటు అధికారులు ఎత్తారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉందని, ప్రస్తుత నీటి నిల్వ 43.22 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 173.35 అడుగులు ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదన కోసం 13,200 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. 4 యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.