రాష్ట్రం గర్వించదగ్గ కళాకారుడు పొన్నాల

ABN , First Publish Date - 2021-07-09T04:05:22+05:30 IST

రాష్ట్రం గర్వించదగ్గ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి అని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి కొనియాడారు. రామసుబ్బారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టరు వైఎస్‌ఆర్‌ జీవిత కాల సాఫల్య పురస్కారం ప్రకటించిన సందర్భంగా 25 కళా సంఘాల తరపున పొన్నాలను గురువారం ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించారు.

రాష్ట్రం గర్వించదగ్గ కళాకారుడు పొన్నాల
పొన్నాలను సత్కరిస్తున్న 25 కళా సంఘాల ప్రతినిధులు

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 8 : రాష్ట్రం గర్వించదగ్గ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి అని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి కొనియాడారు. రామసుబ్బారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టరు వైఎస్‌ఆర్‌ జీవిత కాల సాఫల్య పురస్కారం ప్రకటించిన సందర్భంగా 25 కళా సంఘాల తరపున పొన్నాలను గురువారం ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవాలని ఆకాంక్షించారు. కళాకారులకు ప్రభుత్వం సహాయ సహకారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, అమీర్‌జాన్‌, ఎన్‌ హరనాథ్‌రెడ్డి, డ్యాన్స్‌ మాస్టర్‌ ఎన్‌వీ రాజు, సురేష్‌, లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-09T04:05:22+05:30 IST