Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 16:10:49 IST

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

twitter-iconwatsapp-iconfb-icon
Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

Amazon Great Indian Festival: అమెజాన్ పండుగ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. వివిధ పండుగల సందర్భంగా చాలా కంపెనీలతో పాటూ ఈ కామర్స్‌ సైట్లు కూడా ఆఫర్లను (best offer shopping websites) ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలను (Dussehra Diwali Festivals) పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌, సెప్టెంబర్‌ 23నుంచి 30 వరకు.. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2022 పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల నుంచి గ్రాసరీల వరకు వివిధ వస్తువలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సగం ధరకే అమెజాన్ అందిస్తున్న ఐదు వస్తువుల గురించి తెలుసుకుందాం..

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

అలెక్సాతో ఎకో డాట్-3 స్మార్ట్ స్పీకర్ (Echo Dot (3th Gen) Smart speaker)

అమెజాన్ సేల్‌లో భాగంగా ముందుగా అలెక్సాతో ఎకో డాట్-3 (Echo Dot (3rd Gen) స్మార్ట్ స్పీకర్‌ను రూ. 2,950 తగ్గింపుతో రూ.1,549కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ మిగిలిన స్పీకర్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో వాయిస్ కమాండ్‌తో పాటూ హ్యాండ్స్ ఫ్రీ మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్, కంట్రోల్ స్మార్ట్ హోమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

ఎకో ఫ్లెక్స్-ప్లగ్-ఇన్ (Echo Flex-Plug-in)

అమెజాన్ సేల్‌లో భాగంగా ఎకో ఫ్లెక్స్ ప్లగ్-ఇన్ స్మార్ట్ పరికరాన్ని.. రూ.1,500లు తగ్గింపుతో రూ.1,499కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ‘అలెక్సా’ వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంది. తద్వారా వాయిస్ కమాండ్ సాయంతో ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలను కూడా నియంత్రించవచ్చు.

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

ఎకో షో 5-2  (Echo Show 5 (2nd generation)

Amazon Echo Show 5ని కేవలం రూ.3,999కే కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 8,999లు కాగా.. రూ. 5,000 తగ్గింపుతో అందుబాటులో ఉంచారు. ఈ స్పీకర్‌.. 5.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీ్నని వాయిస్ కమాండ్‌తో కూడా నియంత్రించవచ్చు. అలాగే ఇందులో మెరుగైన వీడియో కాలింగ్, కెమెరా సౌకర్యం కూడా ఉంది. కెమెరా పైకి కనిపించకుండా ఉండేందుకు షట్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

ఫైర్ టీవీ స్టిక్ 4K (Fire TV Stick 4K)

చివరగా అమెజాన్ Fire TV Stick 4Kని కూడా రూ.2,999లకే కొనుగోలు చేయవచ్చు. ఇది వేగవంతంగా పని చేయడంతో పాటూ అంతే వేగంగా Wi-Fiకి సపోర్టు చేస్తుంది. Fire TV Stick 4K UHD, HDRతో HDR10+ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అదేవిధంగా ఈ పరికరం డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. మరోవైపు దీని సాయంతో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్‌లను డాల్బీ విజన్, 4కె రిజల్యూషన్‌తో ఆస్వాదించవచ్చు.

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!

ఎకో బడ్స్-2  (Echo Buds (2nd Gen)

ఎకో బడ్స్-2 కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.11,999లు కాగా.. సేల్‌లో భాగంగా రూ.5,499కి అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ బడ్స్‌ని ఆండ్రాయిడ్, iOS రెండింటితో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అందుబాటులో ఉండడంతో పాటూ 5 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యం కూడా ఉంది.


ఇవి కూడా చదవండిLatest News in Telugu

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా.. Viral Video: వామ్మో! ఈ దున్నపోతు ఏంట్రా.. ఆటోకు ఎదురొచ్చి మరీ ఇలా చేసింది.. videoవార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని.. అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.