వల.. కళ

ABN , First Publish Date - 2022-08-07T05:38:26+05:30 IST

గడిచిన నాలుగేళ్ళుగా కడలికి ఎదురేగుతూ వేటాడుతున్న మత్స్యకారులకు ప్రకృతి సహకరించలేదు. తరచూ తుఫాన్లు, వాయుగుండాలు, కడలి గర్భంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో నష్టాలనే చవిచూశారు.

వల.. కళ

సముద్రంలో మత్స్య సంపద జోరు

మత్స్యకారుల్లో జోష్‌.. ముందస్తు వరద ఎఫెక్ట్‌


నరసాపురం, ఆగస్టు 6 : గడిచిన నాలుగేళ్ళుగా కడలికి ఎదురేగుతూ వేటాడుతున్న మత్స్యకారులకు ప్రకృతి సహకరించలేదు. తరచూ తుఫాన్లు, వాయుగుండాలు, కడలి గర్భంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో నష్టాలనే చవిచూశారు. ఈ ఏడాది ముందస్తు వరద మత్స్య కారుల్లో జోష్‌ నింపింది. వేటకు వెళితే పంట పండుతోంది. స్వదేశీ, విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ వున్న మత్స్య సంపద దొరుకుతుండడంతో మత్స్య కారుల్లో జోష్‌ నెలకొంది. నరసాపురం తీరంలో 19 కిలోమీటర్ల మేర సము ద్రం తీరం విస్తరించింది. గోదావరి కలిసే ప్రదేశం కావడంతో ఇక్కడ వేటా డితే అపార మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ఏడాది జూన్‌లో వేట మొద లైనప్పటికీ అశించిన స్థాయిలో వేట సాగలేదు. జూలైలో ముందస్తు వరద రావడంతో పరిస్థితులు మారాయి. వాతావరణం అనుకూలించడంతో వేటకు మంచి రోజులు వచ్చాయి.  డిమాండ్‌ వున్న టైగర్‌ రొయ్యతోపాటు టూనా, సందువాయి, పండుగొప్ప, కచ్చిడి వంటి చేపలు పుష్కలంగా వలకు చిక్కు తున్నాయి. మొన్నటి వరకు వారం రోజులు వేట సాగిస్తే కనీసం ఖర్చులకు కూడా మిగిలేవి కావు. నేడు ఆ పరిస్థితి లేదు. నాలుగైదు రోజుల్లోనే చాలా మంది మత్స్య కారులు వేట ముగించుకుని వస్తు న్నారు. ఇక్కడ దొరికే టూనా రకాన్ని చెన్నై, కేరళకు హాట్‌ కేకుల్లా ఎగుమతి అవుతున్నాయి. 


కచ్చిడికి డిమాండ్‌

గతంలో కచ్చిడి చేపలు తీరంలో చిక్కేవి కావు. కాకినాడ, విశాఖ తీరంలోనే ఎక్కువగా వలకు పడేవి. అయితే ఈ రకం చేప తీర ప్రాంతంలో దొరుకుతుండటంతో మత్స్య కారుల్లో అనందం వ్యక్తమవుతోంది. ఈ చేపను మందుల తయారీకి విని యోగిస్తున్నారు. బరువును బట్టి ధర పలుకుతుంది. అందులో మగ చేపకే మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల పది కిలోల చేపను రూ.1.50 లక్షలకు విక్రయించారు. కోల్‌కతా మార్కెట్‌లో ఈ రకం చేపకు మంచి డిమాండ్‌ ఉం డటంతో వేట సాగించే మత్స్యకారుల దృష్టంతా కచ్చిడి చేపపై ఉంటుంది. కనీసం ఒక చేప పడితే చాలు పంట పండినట్లే అని చెబుతున్నారు. 


Updated Date - 2022-08-07T05:38:26+05:30 IST