Tsunami విధ్వంస టోంగా ద్వీప దేశానికి సహాయ సామాగ్రితో విమానం

ABN , First Publish Date - 2022-01-20T13:14:16+05:30 IST

అగ్నిపర్వతం పేలుడు, సునామీ విధ్వంసంతో అతలాకుతలమైన టోంగా పసిఫిక్ ద్వీప దేశానికి సహాయ సామాగ్రితో కూడిన మొదటి విమానం గురువారం తెల్లవారుజామున బయలుదేరింది...

Tsunami విధ్వంస టోంగా ద్వీప దేశానికి సహాయ సామాగ్రితో విమానం

సిడ్నీ: అగ్నిపర్వతం పేలుడు, సునామీ విధ్వంసంతో అతలాకుతలమైన టోంగా పసిఫిక్ ద్వీప దేశానికి సహాయ సామాగ్రితో కూడిన మొదటి విమానం గురువారం తెల్లవారుజామున బయలుదేరింది. విమానం దిగేందుకు వీలుగా పువామోటు అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పైనుంచి అగ్నిపర్వత బూడిదను తొలగించారు.అగ్నిపర్వతం పేలుడు వల్ల సునామీ సంభవించింది. సహాయ సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలతో కూడిన విమానం గురువారం ఉదయం 7 గంటలకు అంబర్లీ ఎయిర్ పోర్టు బేస్ నుంచి విమానం బయలుదేరిందని ఆస్ట్రేలియన్ రక్షణ అధికారి చెప్పారు. సునామి బారిన పడిన టోంగాకు రెండవ ఆస్ట్రేలియన్ సహాయ విమానం గురువారం తర్వాత బయలుదేరనుంది.


ఆస్ట్రేలియన్ సైనిక సహాయ నౌక అడిలైడ్  బ్రిస్బేన్ లో నిలిపారు.ఈ నౌక ద్వారా మంచినీటి శుద్ధి పరికరాలు, సహాయ సామాగ్రిని తరలించామని ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ చెప్పారు.ఓడలో సామాగ్రిని లోడ్ చేయడానికి రెండు చినూక్ హెవీ లిప్ట్ హెలికాప్టర్లను ఉపయోగించారు. 


Updated Date - 2022-01-20T13:14:16+05:30 IST