ఈశాన్యంలో తొలి కరోనా మరణం

ABN , First Publish Date - 2020-04-10T20:01:59+05:30 IST

ఈశాన్యంలో తొలి కరోనా మరణం

ఈశాన్యంలో తొలి కరోనా మరణం

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. అసోంలోని హయిలకండి జిల్లాలో 65 ఏళ్ల వృద్ధుడు ఒకరు కరోనాతో మరణించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్రువీకరించారు. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,412కు చేరుకుగా, మృతుల సంఖ్య 199కి చేరింది. మొత్తం కేసుల్లో 5,709 యాక్టివ్ కేసులు నమోదు కాగా, 503 పూర్తిగా కోలుకున్నారు.


ఎక్కడెక్కడ...ఎన్నెన్ని..

అధికారిక లెక్కల ప్రకారం గుజరాత్‌తో శుక్రవారంనాడు మరో రెండు కరోనా మరణాలు సంభవించడంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 19కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇద్దరు మహిళా డాక్టర్లు సహా 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 440కి చేరింది. మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,380కి చేరింది. 

Updated Date - 2020-04-10T20:01:59+05:30 IST