పట్టుపురం పంచాయతీ మళ్లీ మొదటికే..

ABN , First Publish Date - 2021-03-04T04:14:06+05:30 IST

రం పంచాయతీ సర్పంచ్‌ ఎన్నిక వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. తాజాగా బుధవారం ఇక్కడ సర్పంచ్‌ ఎన్నిక కోసం

పట్టుపురం పంచాయతీ మళ్లీ మొదటికే..

పట్టుపురం పంచాయితీ

కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చినా రిజర్వేషన్‌ యథాతథం

తలలు పట్టుకుంటున్న నాయకులు

కోటబొమ్మాళి, మార్చి 3:  పట్టుపురం పంచాయతీ సర్పంచ్‌ ఎన్నిక వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. తాజాగా  బుధవారం ఇక్కడ సర్పంచ్‌ ఎన్నిక కోసం అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇంతకుముందులాగానే ఎస్టీ  రిజర్వేషన్‌ ఖరారు చేశారు. గత రెండు పర్యాయాలుగా  ఇదే పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి ఎస్టీ రిజర్వేషన్‌ను అధికారులు కేటాయిస్తున్నారు. ఈ పంచాయతీలో ఏనేటికొండ కులానికి ఎస్టీ ధ్రువపత్రాలు ప్రభుత్వం జారీ చేయకపోవటం వంటి పరిణామాలతో అక్కడ ఎవ్వరూ పోటీకి ముందుకు రాలేదు. తాజాగా బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లోనూ ఎస్టీ కులానికే రిజర్వేషన్‌ కల్పించటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల  ప్రకారం  ఇక్కడ పంచాయతీలో  ఎస్టీ కులస్థులు అధిక శాతం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం వారికే ప్రాధాన్యం ఇచ్చి రిజర్వేషన్‌ కల్పించింది. అయితే.. ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పిస్తున్న అధికారులు... వారికి కుల ధ్రువీకరణలు  జారీ చేయటంలో చొరవ చూపకపోవడం ఆ పంచాయతీకి శాపంగా మారింది. ఈసారి కూడా అక్కడ పంచాయతీ ప్రజల్లో నిరాశే మిగిలించి. అలాగే.. నీలంపేట పంచాయతీలో 6వవార్డు,  విశ్వనాథపురం పంచాయతీలో ఒకటో వార్డులో కూడా ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించటంతో అక్కడ  కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు.


Updated Date - 2021-03-04T04:14:06+05:30 IST