సుల్తాన్‌బజార్‌లో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-05-18T17:01:12+05:30 IST
సుల్తాన్‌బజార్ పాత పోలీ్‌సస్టేషన్ సమీపంలోని వ్యాపార సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి మూడంతస్తుల
హైదరాబాద్/మంగళ్‌హాట్: సుల్తాన్‌బజార్ పాత పోలీ్‌సస్టేషన్ సమీపంలోని వ్యాపార సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి మూడంతస్తుల భవనంలో వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం మూడో అంతస్తులోని కుట్టు మిషన్లు ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో మంటలను అదుపుచేయడంతో ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.