Abn logo
Feb 24 2021 @ 23:36PM

కరన్‌కోట్‌ సీసీఐలో అగ్నిప్రమాదం

ఐదుగురు కార్మికులకు గాయాలు... ఆస్పత్రికి తరలింపు 

తాండూర్‌రూరల్‌: కరన్‌కోట్‌ గ్రామ సమీపంలోని కేంద్ర ప్రభుత్వరంగ సిమెంట్‌ కర్మాగారంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 మంది కార్మికులకు గాయాలయ్యాయి. కర్మగారంలోని ఉత్పత్తి విభాగంలో ఫ్రీ హీటర్‌లో నాపరాతి నీరు ఒక్కసారిగా జామ్‌ అయింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఉత్పత్తి విభాగం మేనేజర్‌ గార్గు పరిశీలించి  ఫ్రీ హీటర్‌ డోర్‌ను ఓపెన్‌ చేశాడు. దీంతో నాపరాతి ద్రవపదార్థం పక్కనే ఉన్న డిప్యూటీ మేనేజర్‌ దేవంగన్‌,కార్మి కులు బర్నర్‌, మల్లికార్జున్‌, యాదప్ప, జగదీశ్‌లపై పడడంతో  గాయాలయ్యాయి. తోటి కార్మికులు వెంటనే ఫ్రీ హీటర్‌ ను బయటకు తీసుకొచ్చారు.  గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తాండూరుకు తరలించారు. అందులో ప్రొడక్షన్‌ డిప్యూటీ మేనేజర్‌ దేవంగన్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Advertisement
Advertisement