జీసీసీ విక్రయశాలలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-26T04:55:45+05:30 IST

స్థానిక గిరిజన ప్రాథమిక సహకార సంఘం (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వస్తు విక్రయశాలలో మంగళవారం రాత్రి 7 గంటల సమ యంలో అగ్నిప్రమాదం జరిగింది.

జీసీసీ విక్రయశాలలో అగ్నిప్రమాదం
కాలిపోతున్న సామగ్రి: పాతపట్నం

 కాలిపోయిన రికార్డులు, గిరిజనుల ఉత్పత్తులు 

 ప్రమాద తీరుపై సందేహాలు?

పాతపట్నం: స్థానిక గిరిజన ప్రాథమిక సహకార సంఘం (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వస్తు విక్రయశాలలో మంగళవారం రాత్రి 7 గంటల సమ యంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమా దంతో చుట్టుపక్కలా దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో కొంత సమయం ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ఆలీ తన సిబ్బందితో చేరుకున్నారు.  పోలీసులు, జీసీసీ సిబ్బంది, స్థానిక యువకులు కలిసి మంటలను అదుపు చేశారు. విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమా దంలో వస్తు విక్రయశాలలోని కంప్యూటర్‌, రికార్డులు, అమ్మకానికి సిద్ధం చేసిన పలు గిరిజన ఉత్పత్తులు కాలి బూడిదైనట్లు డిపో మేనేజర్‌ కె.శ్రీరాములు తెలిపారు. నష్టతీవ్రతపై ఇంకా ప్రాథమిక అంచనా వేయాల్సి ఉందని చెప్పారు. 

ఇది నిజంగా ప్రమాదమేనా?

జీసీసీ వస్తు విక్రయశాలలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆదివాసీ సంఘ పరిషత్‌ జిల్లా కార్యదర్శి వాబ యోగి సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఈ విధమైన ప్రమాదం జరగడంపై ఆయన పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏటా మార్చి నెలాఖరులో విక్రయశాలలో పలు రకాల గిరిజన ఉత్పత్తులు మిగిలిపోయి పురుగులు పడుతుంటాయన్నారు. దీనికి గల కారణా లను జీసీసీ డిపో మేనేజర్‌, సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పాల్సి ఉంటుంద న్నారు.  వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అసలు నిజం నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు.  


 


Updated Date - 2022-01-26T04:55:45+05:30 IST