అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-17T04:43:09+05:30 IST

అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పొదలకూరు అగ్నిమాపక అధికారి వరకుమార్‌ అన్నారు.

అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలపై అవగాహన
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారి వరకుమార్‌, సిబ్బంది

పొదలకూరు, ఏప్రిల్‌ 16 : అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పొదలకూరు అగ్నిమాపక అధికారి వరకుమార్‌ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఆచారి అపార్టుమెంట్‌, తోకంచి కాలనీలోని ప్రజలు అగ్ని ప్రమాదాలపై ఫైర్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. వేసవిలో ప్రమాదాలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రతను తగ్గించడం, బాధితులను రక్షించే విషయంలో యువకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు.  

Updated Date - 2021-04-17T04:43:09+05:30 IST