విద్యుత్‌ టారిఫ్‌పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2021-01-21T05:16:12+05:30 IST

విద్యుత్‌ టారిఫ్‌కు సం బంధించి ఏపీఈఆర్‌సీ మూడు రోజుల పాటు నిర్వహిం చిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో పూర్తయింది.

విద్యుత్‌ టారిఫ్‌పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ


ఏలూరుసిటీ, జనవరి 19: విద్యుత్‌ టారిఫ్‌కు సం బంధించి ఏపీఈఆర్‌సీ మూడు రోజుల పాటు నిర్వహిం చిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో పూర్తయింది. వ్యవసాయ విద్యుత్‌, హెచ్‌టీ విద్యుత్‌, సాధారణ విద్యుత్‌లో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వీడియో కాన్‌పరెన్స్‌లో వినియోగదారులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రధానంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టవద్దని వినియోగదారులు ముక్తకంఠంతో కోరగా మిగిలిన పలు సమస్యలను వినియోగదారులు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టీస్‌ సివీ నాగార్జునరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఏపీఈపీడీసీఎల్‌ ప్రధాన కార్యాల యమైన విశాఖపట్నం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాకు చెందిన 10 మంది వినియో గదారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రా యాలను వెల్లడించారు. చివరిరోజైన బుధవారం నాడు జిల్లాకు చెందిన బి.సాంబశివరావు, పీవీ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. పౌలీ్ట్ర ఫారంలలో లైటింగ్‌ సర్వీసులను కేటగిరి– 2 నుంచి కేటగిరి–5కు మార్పు చేయాలని వారు కోరారు. మొదటి రెండు రోజుల్లో పాల్గొన్న విద్యుత్‌ వినియోగదారులు కూడా పలు అంశాలను ఏపీఈఆర్‌సీ దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకణలో వచ్చిన అంశాల ఆధారంగా ఏపీఈఆర్‌సీ విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటిస్తుంది. 


Updated Date - 2021-01-21T05:16:12+05:30 IST