మాస్కులు లేని వారికి జరిమానా

ABN , First Publish Date - 2021-04-11T04:41:32+05:30 IST

మాస్కులు లేకుండా అనవసరంగా బయట తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు.

మాస్కులు లేని వారికి జరిమానా

కడప (క్రైం), ఏప్రిల్‌ 10: మాస్కులు లేకుండా అనవసరంగా బయట తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఏ మాత్రం మాస్కులు లేకుండా తిరిగితే మాత్రం ఎటువంటి ఉపేక్ష లేకుండా కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగాశనివారం మాస్కులు ధరించని వారిని గుర్తించి 933 కేసులు నమోదు చేసి రూ.1,36,945 జరిమానా విఽధించినట్లు తెలిపారు. కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, జమ్మలమడుగు సబ్‌ డివిజన్ల పరిధిలో  కేసులు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-04-11T04:41:32+05:30 IST