అదేంటో ఊహించగలరా?

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

పరిసరాలను నిశితంగా పరిశీలించడం, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం వంటి నైపుణ్యాలు ఈ ఆటతో పెరుగుతాయి. ఈ ఆట ఆడటానికి ఇంట్లో వస్తువులు...

అదేంటో ఊహించగలరా?

  • పరిసరాలను నిశితంగా పరిశీలించడం, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం వంటి నైపుణ్యాలు ఈ ఆటతో పెరుగుతాయి. ఈ ఆట ఆడటానికి ఇంట్లో వస్తువులు చాలు. ‘‘ఐ స్పై విత్‌ మై ఐ సమ్‌థింగ్‌...’’ అని పిలిచే ఈ ఆటను ఈరోజు ట్రై చేయండి.

  • ముందుగా ఇంట్లో నుంచి ఒక వస్తువు తీసుకోవాలి. ఆ వస్తువు పేరు చెప్పకూడదు. 
  • ఆట ఆడే వ్యక్తి కళ్లు మూసుకోవాలి. ఇతరులు ఆ వస్తువు గురించి కొంత వర్ణన చెప్పాలి. రంగు, సైజు, షేప్‌ గురించి చెప్పొచ్చు. గెస్‌ చేయడానికి క్లూస్‌ అందిస్తూ ఉండాలి. 
  • కళ్లు మూసుకున్న వ్యక్తి ఆ క్లూస్‌ వింటూ ఆ వస్తువు ఏదో ఊహించాలి. వస్తువు పేరు కరెక్ట్‌గా చెబితే గెలిచినట్టు. ఒకవేళ చెప్పలేకపోతే మళ్లీ తనే ఆట ఆడాల్సి ఉంటుంది. ఈసారి ఇంకో వస్తువు తీసుకోవాలి.
  • ఇంటి పట్టునే ఉంటూ ఎంజాయ్‌ చేయడానికి ఈ ఆట బాగా పనికొస్తుంది. పిల్లల్లో ఊహా శక్తి, ఆలోచనా శక్తి పెరుగుతుంది.

Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST