మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2021-08-04T04:16:10+05:30 IST

లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ ఈనెల 1న ఎక్సైజ్‌ కార్యాలయంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి మోకుదెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం
శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న మోకుదెబ్బ గౌడ సంఘం నాయకులు

లక్షెట్టిపేట, ఆగస్టు 3: లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ ఈనెల 1న ఎక్సైజ్‌ కార్యాలయంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి మోకుదెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమర వేణి నర్సాగౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీపతి లింగాగౌడ్‌లు శ్రీనివాస్‌గౌడ్‌ చిత్ర పటానికి వాళులర్పించారు. విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబా నికి  అండగా ఉంటామని, ఎక్సైజ్‌ శాఖ మంత్రితో కూడా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించామన్నారు. మెండిగౌడ్‌, పొన్నం తిరుపతిగౌడ్‌, కమలాకర్‌ గౌడ్‌, బుర్ర తిరుపతి గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, బల్లాం నర్సాగౌడ్‌ పాల్గొన్నారు.

గౌడ కులస్థుల సమస్యలు పరిష్కరించాలి 

జన్నారం: గౌడ కులస్థుల సమస్యలు పరిష్కరించాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు నర్సాగౌడ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఈనెల 18న ఆవిష్కరిం చనున్నట్లు తెలిపారు. గౌడ కులస్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, లింగాగౌడ్‌, నాగన్నగౌడ్‌ ఉన్నారు. 

Updated Date - 2021-08-04T04:16:10+05:30 IST