వృద్ధురాలికి అంత్యక్రియల్లో అన్నీ తామై

ABN , First Publish Date - 2021-04-16T06:18:08+05:30 IST

ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మినహా మిగతా అందరికీ కరోనా సోకింది. ఈక్రమంలో సదరు వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది.

వృద్ధురాలికి అంత్యక్రియల్లో అన్నీ తామై
వృద్దురాలికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సేవాసమితి బాధ్యులు

మానవత్వం చాటుకున్న పవన్‌కల్యాణ్‌ సేవాసమితి 

అశ్వారావుపేట రూరల్‌, ఏప్రిల్‌ 15: ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మినహా మిగతా అందరికీ కరోనా సోకింది. ఈక్రమంలో సదరు వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఈక్రమంలో దహన సంస్కారాలకు కుటుంబ సభ్యు లు ఎవరూ ముందుకు రాకపోవడంతో అశ్వారావుపేట పవన్‌ కళ్యాణ్‌సేవాసమితి బాధ్యులు ఆ బాధ్యత తీసుకు న్నారు. అశ్వారావుపేటలోని సాయిసుమన్‌ థియేటర్‌ ఎదురు సందులో ఓ ఇంట్లో ముగ్గురికి కరోనా సోకింది. మరో ఇద్దరికి నెగిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన వ్యక్తులో ఒకరైన వృద్ధురాలు గురువారం ఉదయం మరణించారు. ఇంట్లో కరోనా ఉందంటూ బంధువులు, ఇతరులు ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో సమాచారం అందుకున్న పవన్‌ కళ్యాణ్‌ సేవాసమితి అధ్యక్షుడు డేగల రాము తన బృందంలో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు. పంచాయతీ ద్వారా పీపీఈ కిట్లు, బ్లీచింగ్‌ పౌడర్‌ సేకరించి వృద్ధురాలిని ప్రత్యేకంగా వాహనంలో తీసుకుపోయారు. శ్మశాన వాటికలో జేసీబీ సాయంతో గోయి తీసి వృద్ధురాలిని ఖననం చేశారు. కార్యక్రమంలో కురుశెట్టి నాగబాబునాయుడు, పి.రమేశ్‌, ప్రసాద్‌శర్మ, కిషోర్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:18:08+05:30 IST