విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ చూసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-08-10T05:25:58+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగం గా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీ చ లనచిత్రాన్ని సినిమా హాళ్లల్లో ఉచితంగా ప్రదర్శించారు.

విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ చూసిన ఎమ్మెల్యే
మూసాపేటలోని లక్ష్మీకళ ఽథియేటర్‌లో గాంధీ సినిమా ఏర్పాట్లు పరిశీలిస్తున్న జెడ్సీ మమత

కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగం గా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీ చ లనచిత్రాన్ని సినిమా హాళ్లల్లో ఉచితంగా ప్రదర్శించారు. దివంగత డైరెక్టర్‌ రిచర్డ్‌ అటెనబరో తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని కుత్బుల్లాపూర్‌ ప రిధిలోని పలు ఽథియేటర్లలో మంగళవారం ప్రదర్శించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, డీసీలు మంగతాయారు, ప్రశాంతి, ఎస్‌హెచవోలు ప్రశాంత, పవన, సైదులు, రమణారెడ్డి, ఆర్పీ రమేష్‌, విద్యార్థులతో కలిసి మహాత్మాగాంధీ చిత్రాన్ని వీక్షించారు.  

 కూకట్‌పల్లి (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి పరిధిలోని లక్ష్మీకళ, శశికళ థియేటర్లలో  మంగళవారం గాంధీ సినిమాను ప్రదర్శించారు. ఈ సం దర్భంగా సినిమా ఏర్పాట్లను జోనల్‌ కమిషనర్‌ మమత, ఉపకమిషనర్‌ రవికుమార్‌ పరిశీలించారు.  

 కేపీహెచబీ కాలనీ (ఆంధ్రజ్యోతి):  కూకట్‌పల్లిలోని నెక్సస్‌ మాల్‌లోని పీవీఆర్‌ సినిమాస్‌, శివ పార్వతి, విశ్వనాథ్‌, భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో గాంధీ చిత్రాన్ని మంగళవారం ప్రదర్శించగా 2214 మంది విద్యార్థులు సినిమా చూశారు.

గచ్చిబౌలి (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పలు థియేటర్స్‌లో ఉదయం 10నుంచి 1గంట వరకు గాంధీ సినిమాను ప్రదర్శించారు. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఉన్న థియేటర్లు, మాల్స్‌లో మొహర్రం సెలవు కావడంతో స్పందన కనిపించలేదు. కొన్ని థియేటర్లకు విద్యార్థులు రాక పోగా , కొన్ని థియేటర్లకు 10, 12మంది విద్యార్థులు వచ్చారు.   



Updated Date - 2022-08-10T05:25:58+05:30 IST