పెండింగ్‌ సమస్యలపై పోరాటం

ABN , First Publish Date - 2021-01-19T06:22:23+05:30 IST

పాయకరావుపేట నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలపైన, నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేతల అక్రమాలపైన పోరాటాలు సాగించాల్సిందేనని నియోజకవర్గ టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు.

పెండింగ్‌ సమస్యలపై పోరాటం
సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యురాలు అనిత, తదితరులు

  ‘పేట’ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానం

 ఎమ్మెల్యే బాబూరావుపై అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు అనిత వెల్లడి

 

ఎస్‌.రాయవరం, జనవరి 18 : పాయకరావుపేట నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలపైన, నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేతల అక్రమాలపైన పోరాటాలు సాగించాల్సిందేనని నియోజకవర్గ టీడీపీ సమన్వయకమిటీ  సమావేశంలో తీర్మానించారు. సోమవారం ఎస్‌.రాయవరం మండలం గోకులపాడులో ఏర్పాటైన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ముఖ్య అతిథిగా మాట్లాడారు.  ఎమ్మెల్యే బాబూరావు అక్రమాలకు పాల్పడ్డారంటూ తాను చేసిన ఆరోపణకు కట్టుబడి వున్నానని చెప్పారు. అటువంటిదేమీ లేదని ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యేకు ఉపమాక దారి తెలియలేదా.. ? అని ఆమె ప్రశ్నించారు. కోటవురట్ల, నక్కపల్లి సీహెచ్‌సీలను 50 పడకల ఆస్పత్రులుగా విస్తరిస్తూ తమ ప్రభుత్వ హయాంలోనే జీవోలు విడుదలయ్యాయని, ఉద్దండపురం వాటర్‌ ప్రాజెక్ట్‌ ఎవరి హయాంలో నిర్మితమైనదో ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ ఎంపీపీ ఏజర్ల వినోద్‌రాజు, ఎస్‌.రాయవరం, నక్కపల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు  నల్లపరాజు వెంకట్రాజు, కురందాసు నూకరాజు,  నాయకులు  పెదిరెడ్డి చిట్టిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, ఇటీవల టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ కమిటీలో చోటు దక్కించుకున్న  నియోజకవర్గ నాయకులను అనిత సన్మానించారు.  ఉపాధ్యక్షుడు కురందాసు నూకరాజు, అధికార ప్రతినిధి నానేపల్లి రాఘవులు, కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తుంపాల నాగేశ్వరరావు, కార్యదర్శి వంకా రమణలను దుశ్శాలువలతో కప్పి సత్కరించారు.  

Updated Date - 2021-01-19T06:22:23+05:30 IST