సాగు చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-10-20T06:54:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు.

సాగు చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం
నకిరేకల్‌లో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి

సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

నకిరేకల్‌, అక్టోబరు 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌లోని కేఈఆర్‌ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సీపీఎం మండల 7వ మహాసభలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములై ఐక్య ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ధరలు పెంచి పేద వర్గాలపై భారం మోపుతోందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలపై ఐక్యతతో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, కందాళ ప్రమీళ, పట్టణ అధ్యక్షుడు సాకుంట్ల నర్సింహ, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్‌, చిన్నవెంకులు, నగేష్‌, మర్రి వెంకటయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, కొప్పుల అంజయ్య, అక్కనపల్లి సైదులు, పుట్ట ముత్తిరాములు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటుచేయాలి  

చండూరు : గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండా శ్రీశైలం డిమాండ్‌చేశారు. చండూరు మార్కెట్‌ యార్డులో నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కర్నాటి మల్లేశం, మండల కార్యదర్శి బొట్ట శివకుమార్‌, హమాలీ సంఘం అధ్యక్షుడు పాశం లింగయ్య, గ్రామ అధ్యక్షుడు సైదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:54:28+05:30 IST