hyderabd: నగరంలో 50 ట్రిపుల్ తలాఖ్ కేసులు

ABN , First Publish Date - 2021-08-17T13:49:00+05:30 IST

ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించినా హైదరాబాద్ నగరంలోని పోలీసుస్టేషన్లలో ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి....

hyderabd: నగరంలో 50 ట్రిపుల్ తలాఖ్ కేసులు

హైదరాబాద్ : ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించినా హైదరాబాద్ నగరంలోని పోలీసుస్టేషన్లలో ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019లోనే ఆమోదం పొందినప్పటికీ 50 మంది ముస్లిమ్ మహిళలు తమ భర్తలు తమకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చారంటూ పోలీసులను ఆశ్రయించారు.దీంతో పోలీసులు ఒక్క రాజధాని నగరమైన హైదరాబాద్ లోనే 50 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదు చేశారు.ఒక్క హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధిలోనే 40 ట్రిపుల్ తలాఖ్ కేసులున్నాయి. 


సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 10 కేసులు నమోదైనాయి.  ట్రిపుల్ తలాఖ్ పద్ధతిని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చినా ఇంకా కొందరు ముస్లిమ్ భర్తలు ట్రిపుల్ తలాఖ్ లు ఇస్తూనే ఉన్నారని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ముస్లిమ్ మహిళ సోమాలియా దేశానికి చెందిన అబ్దీవాలి అహ్మద్ ను 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్త అబ్దీ వాలీ భార్యను హైదరాబాద్ లోనే వదిలి అమెరికా వెళ్లి పోయాడు. అనంతరం అమెరికా నుంచి ఫోన్ చేసిన భర్త ట్రిపుల్ తలాఖ్ అంటూ చెప్పాడు.అనంతరం విడాకుల పత్రాన్ని సైతం వాట్సాప్ లో పంపించాడు.


దీంతో బాధిత భార్య పోలీసు కేసు పెట్టారు. ఈ కేసు పోలీసుల విచారణలో ఉంది. ఎల్ బినగర్ లో జరిగిన మరో కేసులో భార్య గృహహింస కేసు పెట్టిందని భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.ట్రిపుల్ తలాఖ్ కేసుల్లో పోలీసులు ఆధారాలు, సాక్ష్యాలను సేకరించడం సమస్యగా మారింది. దీంతో పలు ట్రిపుల్ తలాఖ్ కేసులు కోర్టులు, పోలీసుల వద్ద పెండింగులోనే ఉన్నాయి.


Updated Date - 2021-08-17T13:49:00+05:30 IST