ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావీకి సీలు

ABN , First Publish Date - 2020-04-02T14:42:14+05:30 IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావీలో కరోనావైరస్ సోకి 56 ఏళ్ల వ్యక్తి మరణించడంతో అప్రమత్తమైన ముంబై అధికారులు ఈ మురికివాడకు సీలు వేశారు....

ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావీకి సీలు

  • కరోనాతో ఒకరి మృతి 

ముంబై : ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావీలో కరోనావైరస్ సోకి 56 ఏళ్ల వ్యక్తి మరణించడంతో అప్రమత్తమైన ముంబై అధికారులు ఈ మురికివాడకు సీలు వేశారు. మురికివాడకు చెందిన వ్యక్తి మొదటిసారి కరోనాతో మరణించడంతో అతని కుటుంబసభ్యుల్లో 8 మందికి పరీక్షలు చేసి నిర్భంధంలోకి పంపించారు. కరోనాతో మరణించిన వ్యక్తి ధారావీ మురికవాడలోని జామా మసీదులో ప్రార్థనలు చేశారని వార్డు అధికారులు గుర్తించారు. ధారావీలోని 8 భవనాల్లో 308 ఫ్లాట్లు, 91 షాపులకు సీలు వేశారు.


వస్త్ర దుకాణం నిర్వహించే ఈ వ్యక్తికి దగ్గుతో సియోన్ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం అతన్ి కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. కరోనా మృతుడు అధిక జనాభా ఉన్న ధారావీలో నివశిస్తున్నందున అతను కలిసిన వారందరినీ గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు.


మురికివాడలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి వారికి పౌరసంఘం నుంచి ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నామని ముంబై మురికివాడల పునరావాస అథారిటీ అధికారులు చెప్పారు. ధారావీ మురికివాడ నుంచి ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చారని తేలడంతో వారందరినీ హోం క్వారంటైన్ చేశారు. కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ముందుజాగ్రత్తగా ధారావీ నుంచి ప్రజలను బయటకు అనుమతించబోమని వార్డు కార్యాలయం అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-04-02T14:42:14+05:30 IST