Abn logo
May 17 2021 @ 00:45AM

ఐదోరోజు పటిష్టంగా లాక్‌డౌన

లాక్‌డౌన నేపథ్యంలో నిర్మానుష్యంగా ఉన్న నకిరేకల్‌ మెయిన సెంటర్‌

నకిరేకల్‌ / చింతపల్లి / మర్రిగూడ, మే 16 : జిల్లాలో ఐదోరోజు ఆదివారం లాక్‌డౌన పటిష్టంగా అమలైంది. సడలింపు సమయం అనంతరం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నకిరేకల్‌లో లాక్‌డౌన కట్టుదిట్టంగా అమలు చేశారు. ఉదయం 10గంటల తర్వాత పోలీసులు దుకాణాలను మూసి వేయించి ప్రజలు బయటకు రాకుండా బందోబస్తు నిర్వహించారు. నకిరేకల్‌ మెయిన సెంటర్‌ నిర్మానుష్యంగా మారింది. నకిరేకల్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు పర్యటించి దుకాణాలు మూయించారు. చింతపల్లి మండలంలోని వీటీనగర్‌లో తొలి నాలుగు రోజులు బయటకురాని ప్రజలు ఆదివారం భారీగా రోడ్లపైకి రావడంతో వీటీనగర్‌లోని నల్లగొండ రహదారి భారీగా ట్రాఫిక్‌ జామైంది. మర్రిగూడ మండలంలో ఉదయం 10గంటల నుంచే ఏ ఒక్కరు రోడ్ల మీదికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఒక పక్క పోలీసులు బందోబస్తుతో నిఘా ఏర్పాటు చేసి లాక్‌డౌనకు సహకరించాలని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ కోరారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
నేరేడుగొమ్ము / మర్రిగూడ / దేవరకొండ / మునుగోడు : నేరేడుగొమ్ము మండల కేంద్రంలో లాక్‌డౌన నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా బయట తిరుగుతున్న ఐదుగురు ద్విచక్ర వాహనదారులు, దుకాణాలు తెరిచిన ముగ్గురు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ వెంకటయ్య తెలిపారు. లాక్‌డౌన నిబంధనలు అందరూ పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్రపుతండా, పెద్దమునిగల్‌, కొత్తపల్లిలో కిరాణ దుకాణాలపై కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. మర్రిగూడ మండలంలో లాక్‌డౌన నిబంధనలు ఉల్లఘించిన 19మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ ఆదివారం తెలిపారు. అదేవిధంగా రాత్రివేళలో మాస్కులులేకుండా వాహనాలపై తిరుగుతున్న 62మందిని పట్టుకుని జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కోర్టుకు రిమాండ్‌ చేస్తామన్నారు. దేవరకొండలో లాక్‌డౌన నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు దుకాణాల యజమానులపై కేసులు నమోదుచేసినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.  లాక్‌డౌన సమయంలో  అవసరం లేకున్నా వాహనాలపై రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరం ఉంటేనే బయటకురావాలని, వారి వెంట గుర్తింపుకార్డు, డాక్టర్‌ మందుల చీటి తెచ్చుకోవాలని కోరారు. మునుగోడు మండలంలో భద్రతా చర్యలను చండూరు సీఐ సురే్‌షకుమార్‌ పరిశీలించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement