Boris Johnsonపై Fevicol వ్యంగ్యాస్త్రం.. పాత ఫొటోను షేర్ చేసి సెటైర్!

ABN , First Publish Date - 2022-07-10T00:20:07+05:30 IST

నిత్యం వివాదాలతో సహవాసం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి గురువారం రాజీనామా చేశారు.

Boris Johnsonపై Fevicol వ్యంగ్యాస్త్రం.. పాత ఫొటోను షేర్ చేసి సెటైర్!

నిత్యం వివాదాలతో సహవాసం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్‌ పార్టీ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. బ్లాక్‌పూల్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్ని బయటకు తరలించిన సంగతి తెలిసిందే. KFC వంటి పలు అంతర్జాతీయ బ్రాండ్‌లు బోరిస్‌ను ఎగతాళి చేస్తూ జోకులు, మీమ్‌లు పోస్ట్ చేస్తున్నాయి.


తాజాగా భారత కంపెనీ Fevicol కూడా బోరిస్ జాన్సన్‌ను ఉద్దేశిస్తూ ఓ పాత్ ట్వీట్‌ను మళ్లీ షేర్ చేసింది. 2020లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్ల్కే రాజకుటుంబం నుంచి విడిపోయినపుడు ఫెవికాల్ ఈ పోస్ట్ చేసింది. `డియర్ రాయల్ ఫ్యామిలీ.. మీకు కావాల్సింది కోహినూర్ కాదు.. ఫెవికాల్` అని కామెంట్ చేస్తూ ఆ ట్వీట్ చేసింది. తాజాగా ఆ ట్వీట్‌ను `మేము దీనిని మళ్లీ చెబుతాము` అంటూ రీ-పోస్ట్ చేసింది. 


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్ పించర్‌ను బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా బోరిస్ నియమించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక, కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్ విధించినా పార్టీ చేసుకోవడం బోరిస్‌కు మచ్చ తెచ్చింది. పించర్ మీద ఉన్న లైంగిక వేధింపుల గురించి ముందు తనకు తెలియదు అన్న బోరిస్, చివరకు తెలుసు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో బోరిస్‌ను వెనుకేసుకు వచ్చిన మంత్రులు మోసపోయినట్లుగా భావించారు. బోరిస్ ప్రభుత్వంలోని సుమారు 50 మంది మంత్రులు, సహాయకులు రాజీనామాలు చేశారు. బోరిస్‌కు నమ్మకస్తులు అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆయనను వదిలేశారు. సొంత పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గిన బోరిస్, పదవి నుంచి తప్పుకున్నారు. 



Updated Date - 2022-07-10T00:20:07+05:30 IST