ప్రతివారం ఫీవర్‌ సర్వే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-01-23T06:26:25+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతివారం ఫీవర్‌ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.. అధికారులను ఆదేశించారు.

ప్రతివారం ఫీవర్‌ సర్వే చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం, జనవరి22 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతివారం ఫీవర్‌ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో జేసీ సిరితో కలిసి కొవిడ్‌, ఫీవర్‌ సర్వే, వ్యాక్సినేషన, ఓటీఎస్‌, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, జగనన్నతోడు తదితర అంశాలపై అధికారులతో సమీక్షిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ మూడోదశ నేపథ్యంలో నాలుగో విడత ఫీవర్‌ సర్వే సోమవారం నుంచి శుక్రవారంలోపు పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో ప్రతి ఆదివారం ఫీవర్‌ సర్వేపై వైద్యాధికారులు, వలంటీర్లు, ఏఎనఎంలు, ఆశా వర్కర్లందర్నీ అప్రమత్తం చే యాలని ఆదేశించారు. రోజూ ఫీవర్‌ సర్వే 20 శాతం పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. సర్వేలో కరోనా లక్షణాలు కనిపిస్తే హోమ్‌ ఐసోలేషనలో ఉండేలా చూడాలన్నారు. కరోనా నిబంధనలు పాటించని ప్రజలు, దుకాణాల యజమానులపై జరిమానాలు విధించాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషనకు సంబంధిం చి పెండింగ్‌లో ఉన్న ఫ్రంట్‌లైన, హెల్త్‌కేర్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ను ఒక రోజులోపు పూర్తి చేయాలన్నారు. శనివారం చేపట్టిన లక్ష వ్యాక్సినేషన డ్రైవ్‌లో 70 వేల వరకూ లక్ష్యాన్ని చేరుకున్నారన్నారు. ఆదివారం కూడా చేపట్టాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఓటీఎస్‌ సర్వేను వెంటనే వందశాతం పూర్తి చేయాలన్నారు. ఆయా మున్సిపాల్టీల పరిధిలో సోమవారంలోగా ఒక్కటి కూ డా పెండింగ్‌ ఉంచకుండా సర్వే చేపట్టాలని ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్‌ లేఔట్లలో బోర్లు, పైపులైనలు వేయడం, విద్యుత సరఫరా, అన్నిరకాల మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. జగనన్న తోడు పథకం కింద లబ్ధిదారులకు తక్షణం రుణాలు మంజూరు చేసి, వారి అకౌంట్లలో డబ్బు జమ చేయాలని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులతో వారానికి రెండుసార్లు సమావేశాలు పెట్టి రుణాల మంజూరు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన గ్రీవెన్సలో విద్యుత, రెవెన్యూ, అర్బన శాఖలకు సంబంధించి ఎక్కు వ అర్జీలు పెండింగ్‌ ఉన్నాయనీ.. గడువులోగా వాటికి పరిష్కారం చూపాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు, అనంత కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, మెప్మా పీడీ విజయలక్ష్మి, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ వెంకటరాజు, స్పందన తహసీల్దార్‌ అనుపమ, మున్సిపల్‌ కమిషనర్లు, టిడ్కో అధికారులు పాల్గొన్నారు.


జిల్లాస్థాయి ‘స్పందన’ నిరవధిక రద్దు 

అనంతపురం వ్యవసాయం, జనవరి 22: కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి ‘స్పందన’ కార్యక్రమాన్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్పందనను తిరిగి ఎప్పట్నుంచి నిర్వహించేది కరోనా కేసుల ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. ఈ మార్పును ప్రజలు గమనించాలన్నారు.


పోలీసు స్పందన కూడా..

అనంతపురం క్రైం, జనవరి 22: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమాన్ని నిరవధికంగా రద్దు చేసినట్లు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప శనివారం ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ కేసులు తగ్గిన తరువాత తదుపరి స్పందన జరిగే తేదీని తెలియజేస్తామన్నారు.

Updated Date - 2022-01-23T06:26:25+05:30 IST