Abn logo
Jun 14 2021 @ 00:24AM

ఇమ్యూనిటీ కోసం...

ప్రతిరోజూ మెంతులు నానబెట్టిన నీళ్లు  ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...


  1. కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషధం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  2. పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. 
  3. రక్తంలో షుగర్‌ స్థాయిలను మెంతులు నియంత్రిస్తాయి. డయాబెటిస్‌ ఉన్న వారు మెంతులను డైట్‌ ప్లాన్‌లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  4. ఉదయం పూట మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు.
  5. మెంతి నీరు యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్‌ వంటి సమస్యలు దూరమవుతాయి.