జాబ్‌లో చేరిన 9 ఏళ్లకే ఆమెకు రూ.60 లక్షల బంగ్లా.. ఆ పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో వెలుగులోకి నివ్వెరపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-06-27T17:39:17+05:30 IST

ఇండోర్‌ టౌన్ ఇన్‌స్పెక్టర్ (టీఐ) ఆత్మహత్య...

జాబ్‌లో చేరిన 9 ఏళ్లకే ఆమెకు రూ.60 లక్షల బంగ్లా.. ఆ పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో వెలుగులోకి నివ్వెరపోయే నిజాలు..!

ఇండోర్‌ టౌన్ ఇన్‌స్పెక్టర్ (టీఐ) ఆత్మహత్య కేసులో మహిళా ఏఎస్‌ఐ రంజనా ఖాండే రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 ఏళ్ల ఉద్యోగంలో రంజనా రూ.60 లక్షల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఇతర ప్రదేశాలలో విలాస ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి విలువను పోలీసులు అంచనా వేస్తున్నారు. బంగ్లా కోసం ఈ మహిళా ఏఎస్‌ఐ...టీఐ హకమ్‌సింగ్‌ పన్వార్‌ను కూడా బ్లాక్‌మెయిల్ చేసినట్లు కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శుక్రవారం భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో టీఐ ఇండోర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు మహిళా ఏఎస్ఐపై కాల్పులు జరిగాయి. దీనిపై పోలీసు కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా... టీఐ హకం సింగ్ పన్వార్ మృతిపై సమాచారాన్ని సేకరించేపనిలో పడ్డారు.


పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా ఏఎస్‌ఐ రంజన చేరి 9 ఏళ్లు మాత్రమే అయింది. ఇన్నేళ్ల ఉద్యోగంలో ఆమె సిలికాన్ సిటీలో 60 లక్షల రూపాయల విలువైన బంగ్లాను కొనుగోలు శారు. ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 2013 ధార్‌లో ఆమె తొలి పోస్టింగ్‌. రంజన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె తన తల్లి, సోదరునితో కలిసి ధమ్నోద్‌లోని సంజయ్ నగర్‌లో ఉండేవారు. ఇక్కడ ఆమె తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపించారు. దీనిపై ఏఎస్సై శాఖాపరమైన విచారణ కూడా చేశారు. ఈ విషయంలో పోలీసులు రాజీ పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత రంజనకు మే 2018లో ఇండోర్‌కు బదిలీ చేశారు. అక్కడ రిటైర్డ్ ఎస్‌ఐ యాదవ్‌ ఆ మహిళా ఏఎస్‌ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంలోనూ రహస్య సెటిల్మెంట్ జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసులో బుర్హాన్‌పూర్‌కు చెందిన ఒక పోలీసు కూడా నిందితుడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పోలీసుల అధికారి హకమ్ సింగ్... రంజనతో డిపార్ట్‌మెంటల్ విషయాలపై చర్చలు జరిపేవారు. ఈ నేపధ్యంలో వారి మధ్య స్నేహం పెరిగింది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సెలవు రోజుల్లో ఆమె హకమ్ సింగ్ ను కలిసేవారు. ఆమె తన స్టైలిష్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2022-06-27T17:39:17+05:30 IST