ఇండియన్‌ ఆర్మీలో మహిళా అగ్నివీర్‌ నియామకాలు

ABN , First Publish Date - 2022-08-12T06:32:06+05:30 IST

నవంబరు నెలలో తమిళనాడులోని వేలూరు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ స్కూల్‌లో ఇండియన్‌ ఆర్మీలో అగ్నిపథ్‌ పథకం జనరల్‌ డ్యూటీ నాలుగు సంవత్సరాల షార్ట్‌ టర్మ్‌ సర్వీస్‌ కింద ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం విడుదల చేసిందని సెట్కూరు సీఈవో పీవీ రమణ తెలిపారు.

ఇండియన్‌ ఆర్మీలో మహిళా అగ్నివీర్‌  నియామకాలు

కర్నూలు(స్పోర్ట్స్‌), ఆగస్టు 11: నవంబరు నెలలో తమిళనాడులోని వేలూరు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ స్కూల్‌లో ఇండియన్‌ ఆర్మీలో అగ్నిపథ్‌ పథకం జనరల్‌ డ్యూటీ నాలుగు సంవత్సరాల షార్ట్‌ టర్మ్‌ సర్వీస్‌ కింద ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం  విడుదల చేసిందని సెట్కూరు సీఈవో పీవీ రమణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణలోని మహిళా అభ్యర్థుల నుంచి  ఆన్‌లైన్‌ దరఖాస్తులు 9వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఏ్ట్టఞట://్జౌజీుఽజీుఽఛీజ్చీుఽ్చటఝడ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌లో స్వీకరిస్తున్నట్లు తెలిపారు.  45 శాతం మార్కులతో పదో  తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వయస్సు పదిహేడున్నర  సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. శారీరక దారుఢ్యంలో భాగంగా కనీస ఎత్తు 162 సెం.మీటు, ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ 77 సెం.మీ, వెడల్పు ఉండి గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెం.మీల వ్యాకోచం చెందాలన్నారు. వివరాలకు ఆర్మీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2022-08-12T06:32:06+05:30 IST