నడుస్తుంటే బాగా ఆయాసం వస్తుంది.. ఏం చేయాలి?
ABN , First Publish Date - 2021-10-01T19:03:40+05:30 IST
కొత్తగా నడక లేదా ఏదైనా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు ఆస్తమా, ఆందోళన, శారీరక శ్రమ ఎక్కువ కావడం, ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం తదితర కారణాల వల్ల ఆయాసం వస్తుంది. మీ ఆయాసానికి కారణాన్ని తెలుసుకొని
ఆంధ్రజ్యోతి(01-10-2021)
ప్రశ్న: నాకు యాభై ఏళ్లు. నడుస్తుంటే బాగా ఆయాసం వస్తోంది. ఆహారం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చా?
- వెంకట్రెడ్డి, విజయవాడ
డాక్టర్ సమాధానం: కొత్తగా నడక లేదా ఏదైనా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు ఆస్తమా, ఆందోళన, శారీరక శ్రమ ఎక్కువ కావడం, ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం తదితర కారణాల వల్ల ఆయాసం వస్తుంది. మీ ఆయాసానికి కారణాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొంటే సమస్య తీరుతుంది. మితంగా సమతులాహారం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచు కోవచ్చు. ఆహారంలో తాజా పండ్లు అధికంగా తీసుకొంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆయాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మీకు ఎటువంటి గుండె జబ్బులు లేనట్టయితే, ఆయాసం వస్తోంది కనుక నడక మానెయ్యకుండా, మీరు సాధారణంగా నడవ గలిగే వేగంతోనే నడకను క్రమం తప్పకుండా కొనసాగించడం ద్వారా కొద్దివారాలలో మీ గుండె పని తీరు, సామర్ధ్యం మెరుగుపడి నెమ్మదిగా ఆయాసం సమస్య కూడా తగ్గుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)