బిడ్డకు పాలివ్వటం వల్ల తల్లికీ ఉపయోగమే.. ఎలాగంటే?

ABN , First Publish Date - 2022-04-06T16:45:28+05:30 IST

తల్లిపాలకంటే గొప్ప ఆహారం ఉండదు. అమృతంతో సమానం. తల్లిపాలు తాగితే బిడ్డకు రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉంటుంది

బిడ్డకు పాలివ్వటం వల్ల తల్లికీ ఉపయోగమే.. ఎలాగంటే?

ఆంధ్రజ్యోతి(06-04-2022)

తల్లిపాలకంటే గొప్ప ఆహారం ఉండదు. అమృతంతో సమానం. తల్లిపాలు తాగితే బిడ్డకు రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉంటుంది. పసికందుకు పాలు ఇవ్వడం వల్ల తల్లికీ ఎన్నో ఉపయోగాలున్నాయి. 


బిడ్డకు పాలిస్తే తల్లీ, బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. తల్లిపాలల్లో ప్రొటీన్లు, ఎమినో ఆమ్లాలుంటాయి. పౌష్టికరమైన ఆహారం తల్లే అందించటం.. సృష్టి గొప్పతనం. పాలవల్ల  బిడ్డ ఎదుగుదల తొందరగా కనపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి.

పుట్టిన తొలినాళ్లలో బ్యాక్టీరియా, వైర్‌సల ప్రభావం బిడ్డకు ఉంటుంది. పాలల్లో యాంటీ బాడీస్‌ ఉండటం వల్ల వీటితో ఫైట్‌ చేస్తాయి. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడే లక్షణం తల్లిపాలకుంది.

తల్లిపాలు సులువుగా జీర్ణమవుతాయి. మలబద్ధక సమస్య ఉండదు. బిడ్డ కడుపులో ఎలాంటి సమస్యలు రావు. దగ్గు, జలుబు తగ్గించే శక్తి వీటికుంది.

ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు విపరీతంగా పెరగకుండా ఉండాలంటే తల్లిపాలే ఉత్తమం.

బిడ్డకు పాలివ్వటం వల్ల తల్లికీ ఉపయోగమే. అందం చెడిపోతుందనేది భ్రమ మాత్రమే. బిడ్డకు పాలిస్తే భవిష్యత్‌లో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉండదు. స్థూలకాయం, ఆస్తమా తగ్గే అవకాశం ఉంటుంది. బీపీ తగ్గుతుంది. బరువు తగ్గుతారు. డిప్రెషన్‌కు గురికారు. పాజటివ్‌ మైండ్‌తో ఉంటుంది. సహనం పెరుగుతుంది.

Updated Date - 2022-04-06T16:45:28+05:30 IST