కఠినంగా వ్యవహరిస్తేనే సంఘవ్యతిరేకుల్లో భయం

ABN , First Publish Date - 2021-10-19T05:17:47+05:30 IST

పోలీసులు తమ విధుల్లో కఠినంగా వ్యవహరించినప్పుడే సంఘవ్యతిరేకుల్లో భయం కలుగుతుందని, మంచివారిలో ధైర్యం ఉంటుందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

కఠినంగా వ్యవహరిస్తేనే సంఘవ్యతిరేకుల్లో భయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు18: పోలీసులు తమ విధుల్లో కఠినంగా వ్యవహరించినప్పుడే సంఘవ్యతిరేకుల్లో భయం కలుగుతుందని, మంచివారిలో ధైర్యం ఉంటుందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యా లయంలో జరిగిన శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు నేరుగా విచారణ అధికారి క్షేత్రస్థాయికి వెళ్లి దర్యాప్తు చేయడం వల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగు తుం దన్నారు. గంజాయి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని, గంజా యిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెం డింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలని, కేసుల పరిశోధనను వేగవంతం చేయాలని చెప్పారు. ప్రొబేషనరీ ఎస్సైలు శాంతిభద్రతల విషయాలతోపాటు దర్యాప్తు, స్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను సునితంగా గమనిస్తూ, సాంకేతికత, దర్యాప్తు అంశాలను నేర్చుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డులను మెయింటేన్‌ చేయాలని పేర్కొ న్నారు. ఈనెల21న పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జరగనున్న పోలీస్‌ప్లాగ్‌ డేను పురస్కరించుకొని  అన్ని పోలీస్‌స్టేషన్‌లలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  కార్యక్రమంలో  అడ్మిన్‌ ఎస్పీ ఎన్‌ వెంకటేశ్వర్లు, స్పెషల్‌బ్రాంచ్‌ అడిషినల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు కిషన్‌, ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:17:47+05:30 IST