తండ్రీ కొడుకుల మధ్య మొదలైన గొడవ.. అర్థరాత్రి మొదలై మర్నాటి మధ్యాహ్నం వరకూ సాగింది... చివరకు ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-07-31T14:17:41+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది.

తండ్రీ కొడుకుల మధ్య మొదలైన గొడవ.. అర్థరాత్రి మొదలై మర్నాటి మధ్యాహ్నం వరకూ సాగింది... చివరకు ఏం జరిగిందంటే...

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుమారుడితో గొడవ జరిగిన నేపధ్యంలో తండ్రి హత్యకు గురయ్యాడు. ఆ యువకుని తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఈ సంఘటన చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో జరిగింది. రాత్రి వివాదం ప్రారంభమై, మర్నాటి మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. తరువాత కేబుల్ ఆపరేటర్ హత్యకు గురయ్యాడు. నిందితుడు కేబుల్ ఆపరేటర్‌పై కత్తితో దాడి చేశాడు. మృతుడి పేరు ఫరూక్ షేక్. నిందితుని పేరు ఇర్ఫాన్‌. నిందితుడు ఇర్ఫాన్ తన కారును స్నేహితుడు లక్కీ షకీబ్‌కు తనఖా పెట్టాడని సమాచారం. కారు విషయంలో ఇర్ఫాన్, లక్కీతో తరచూ గొడవపడేవారు. ఈ నేపధ్యంలో నిందితుడు ఇర్ఫాన్, లక్కీపై దాడి చేశాడు. ఇర్ఫాన్‌ను బెదిరించే ఉద్దేశ్యంతో లక్కీ అతని ఇంటికి వచ్చాడు.  


అనంతరం అతని తండ్రి ఫరూక్‌ను ఇంటి నుండి వెళ్లిపోవాలని కోరుతూ దాడి చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇర్ఫాన్‌ లక్కీపై దాడి చేయబోయాడు. మధ్యలో కల్పించుకున్న తండ్రి ఫరూక్ షేక్‌పైనా దాడి చేశాడు. ఈ ఘటనలో ఫరూక్ మృతి చెందాడు. ఈ హత్య గురించి ఇండోర్ అదనపు ఎస్పీ ప్రశాంత్ చౌబే మాట్లాడుతూ, అర్థరాత్రి కొడుకుతో జరిగిన గొడవలో తండ్రి హత్యకు గురయ్యాడని, నిందితుడు ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-07-31T14:17:41+05:30 IST