Advertisement
Advertisement
Abn logo
Advertisement

20 ఏళ్ల కూతురిని 78 ఏళ్ల వృద్ధుడికి అమ్మేసిన తండ్రి.. ఆమె భర్తకు అసలు విషయం తెలిసి..

కన్నతండ్రి కసాయిలా మారాడు.. వివాహిత అయిన కూతుర్ని ఆమె భర్తకు తెలియకుండా 78 ఏళ్ల వృద్ధుడికి అమ్మేశాడు.. ఆమె అప్పటికే ఓ బిడ్డకు తల్లి కూడా.. భార్యను అమ్మేసిన విషయం తెలుసుకున్న భర్త మామతో గొడవకు దిగలేదు.. అమ్మినపుడు వచ్చిన డబ్బులో వాటా అడిగాడు.. ఇద్దరి మధ్య వాటా విషయంలో తేడా రావడంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. 


ఉదయ్‌పూర్‌కు సమీపంలోని కుంబల్‌గఢ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బాధిత మహిళను ఆమె తండ్రి 78 ఏళ్ల వృద్ధుడికి అమ్మేశాడు. ఆమె అప్పటికే వివాహిత, ఓ బిడ్డకు తల్లి. భర్త జమాల్ పని నిమిత్తం వేరే ఊర్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ తండ్రి ఆమెను 3.40 లక్షల రూపాయలకు ఓ వృద్ధుడికి అమ్మేశాడు. ఈ డీల్‌లో 48 ఏళ్ల మనీషా అనే మహిళ కీలకంగా వ్యవహరించింది. వేరే ఊర్లో పనిచేస్తున్న జమాల్ ఇంటికి వచ్చినపుడు అతనికి విషయం తెలిసింది. భార్యను అమ్మేసినందుకు అతను ఆగ్రహం చెందకపోగా వచ్చిన డబ్బులో మామను వాటా అడిగాడు. 


ఇద్దరి మధ్య డబ్బులు పంచుకునే విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో బాధిత మహిళ భర్త పోలీసులను ఆశ్రయించి మామపై ఫిర్యాదు చేశాడు. బాధిత మహిళను విడిపించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహిళ తండ్రిని, ఏజెంట్‌గా వ్యవహరించిన మనీషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement