Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘోరం.. 18ఏళ్ల కూతురుని కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకు సహా మరో ఇద్దరు బంధువులతో కలిసి దారుణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

ఇంటర్నెట్ డెస్క్: కన్న కూతురు అని కూడా చూడకుండా.. ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకు సహా ఇద్దరు బంధువులతో కలిసి 18ఏళ్ల కూతురుని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను ఊరికి దూరంగా తీసుకెళ్లి, అందరూ నివ్వెరపోయే పని చేశారు. ఈ విషయం తాజాగా బయటకు రావడంతో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధపాల్ సక్సేనా అక్టోబర్ 7న తన 18ఏళ్ల కూతురు రోషిణి కనబకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన ప్రభాత్ అనే వ్యక్తి తన కూతురుని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సంచలన విషయాన్ని గుర్తించారు. ప్రభాత్ రోషిణిని కిడ్నాప్ చేయలేదని తమ విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాకుండా బుద్ధపాల్ సక్సేనానే తన కూతురుని కిడ్నాప్ చేశాడని తాజాగా పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్‌లో విచారించారు. దీంతో బుద్ధపాల్ నిజం చెప్పాడు. 


తన కొడుకు సహా ఇద్దరు బంధువుల సహాయంతో రోషిణిని తానే కిడ్నాప్ చేసినట్టు వెల్లడించాడు. అంతేకాకుండా ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి, హత్య చేసిన తర్వాత కాల్చి బుడిద చేసినట్టు తెలిపాడు. రోషిణి.. ప్రభాత్ అనే వ్యక్తిని ప్రేమించి.. తమకు తెలియకుండానే పెళ్లి కూడా చేసుకుందని పేర్కొన్నాడు. అయితే తన కూతురు పెళ్లి విషయం తాజాగా తనకు తెలియడంతో.. ఆగ్రహంతో రోషిణిని హత్య చేసినట్టు తెలిపాడు. కిడ్నాప్ కేసు పెడితే ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించానని, అందుకే ప్రభాత్‌పై కిడ్నాప్ కేసు పెట్టినట్లు వివరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుద్ధపాల్ సక్సెనా, అతడి కుమారుడుతోపాటు నేరానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement