చైనా ఫాస్టెస్ట్ మెట్రోరైలు ప్రారంభం..

ABN , First Publish Date - 2020-09-26T23:29:50+05:30 IST

చైనాలోని సదరల్ గాంగ్ఝూలో గంటలకు 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్టెస్ట్ సబ్‌వే మెట్రోరైలు...

చైనా ఫాస్టెస్ట్ మెట్రోరైలు ప్రారంభం..

బీజింగ్: చైనాలో గంటలకు 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్టెస్ట్ సబ్‌వే మెట్రోరైలు ఇవాళ ప్రారంభమైంది.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గాంగ్ఝూ మెట్రోలోని 18, 20 నెంబర్ మెట్రో లైన్లలో సేవలు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇది ప్రారంభమైతే  నాన్షా ఫ్రీ ట్రేడ్ జోన్ నుంచి సౌత్ గాంగ్ఝూ రైల్వే స్టేషన్, ఈస్ట్ గాంగ్ఝూ రైల్వే స్టేషన్లకు వరుసగా 25, 30 నిమిషాల్లో చేరుకోవచ్చునని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. భవిషత్తులో గాంగ్‌డాంగ్‌లోని ఝుహై, ఝోన్హాన్, డాంగువాన్ నగరాలకు కూడా ఈ రెండు లైన్లను విస్తరించనున్నారు. సీఆర్ఆర్‌సీ నుంచి 18, 22 నెంబర్ లైన్లలో నడిపేందుకు గాంగ్ఝూ రైల్వే మొత్తం 40 రైళ్లను ఆర్డర్ చేసింది. 

Updated Date - 2020-09-26T23:29:50+05:30 IST