ఫసల్‌ బీమా ఐచ్ఛికం

ABN , First Publish Date - 2020-02-20T08:59:23+05:30 IST

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రైతులకు ఈ బీమా పథకాన్ని ఐచ్ఛికంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2016లో

ఫసల్‌ బీమా ఐచ్ఛికం

రెండో దశ స్వచ్ఛ భారత్‌కు పచ్చజెండా

22వ లా కమిషన్‌ ఏర్పాటుకు ఓకే

పాడి పరిశ్రమకు వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

ఏప్రిల్‌ 1 నుంచి స్వచ్ఛ పెట్రోల్‌

దేశమంతా అత్యంత శుద్ధి చేసిన ఇంధనం

యూరో ‘4’ నుంచి నేరుగా ‘6’కి భారత్‌

 న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రైతులకు ఈ బీమా పథకాన్ని ఐచ్ఛికంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌  నిర్ణయం తీసుకుంది. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు.. రుణం తీసుకునే ప్రతి రైతూ పీఎంఎ్‌ఫబీవైలో చేరాలని నిబంధన పెట్టారు. అయితే, వ్యవసాయ బీమా పథకంలోని లొసుగులను సరిదిద్దేందుకు ఈ నిబంధనను సడలించి పీఎంఎ్‌ఫబీఐని ఐచ్ఛికం చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  పలు రాష్ట్రాల రైతుల నుంచి వచ్చిన  అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 58శాతం రైతులు రుణగ్రహీతలేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ బుధవారం ఢిల్లీలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ రెండో దశకు పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు రెండో దశ 2020-21, 2024-25 మధ్యకాలంలో రూ.52,497 కోట్లు వెచ్చించనున్నారు. న్యాయ వివాదాలకు సంబంధించి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు  22వ లా కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. ఇది మూడేళ్లు ఉంటుంది. 


కేబినెట్‌ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

పాడి రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీని 2శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల సుమారు 95లక్షలమంది రైతుకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. 

2019-2024 మధ్యకాలంలో 10వేల రైతు ఉత్పత్తి సంస్థ(ఎ్‌ఫపీవో)లను ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. దీనికి సుమారు 4500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటి ఏర్పాటు వల్ల రైతాంగానికి పెట్టుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని పేర్కొంది.

గుజరాత్‌లోని భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌(బీఐఎ్‌సఏజీ)ను మరింత అభివృద్ధి చేసి జాతీయ సంస్థగా మార్చడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

 ఇన్‌-విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) క్లినిక్‌లు, వాటి అనుబంధ సేవల నియంత్రణ బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.  

Updated Date - 2020-02-20T08:59:23+05:30 IST