శ్రీనగర్ : మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా ప్రార్థనలకు వెళ్తుంటే ఫరూక్ అబ్దుల్లాను అధికారులు అడ్డుకున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై అధికార గణం మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం ఉండే రోడ్డును అధికారులు మూసేశారు. దర్గాలో ప్రార్థనలకు వెళ్లకుండా అధికార యంత్రాంగం అడ్డుకుంది. ప్రాథమిక హక్కులకు కూడా అడ్డుకట్టవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మిలాద్ ఉన్ నబీ లాంటి పర్వ దినాల్లో.’’ అని పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడింది.