Abn logo
Mar 27 2020 @ 04:25AM

రైతులను తక్షణం అదుకోవాలి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి


కడప (రవీంద్రనగర్‌), మార్చి: 26, రైతులను ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వం పండ్లతోట రైతులను అదుకోవాలని తెలిపారు. అరటి, దోస, కర్బూజ, బత్తాయి పంటలను కొనే నాథుడే కరువయ్యారన్నారు. టమోటా రైతులు పంటను అమ్ముకోలేక  నష్టపోతున్నారని, వేంటనే ప్రభుత్వం రైతులను అదుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. అలాగే కరోనా వైరస్‌ వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, తక్షణమే రూ.ఐదు వేలు అందించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement