రాయితీ పథకాలను రైతులు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-08-04T04:52:31+05:30 IST

ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాయితీ పథకాలను రైతులు వినియోగించుకోవాలి
లబ్ధిదారులకు గడ్డికోత మిషన్లను అందిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- తొమ్మిది మంది రైతులకు గడ్డి కోత మిషన్లు పంపిణీ 

బిజినేపల్లి, ఆగస్టు 3 : ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయం  ఆవరణలో మం గళవారం వడ్డెమాన్‌, లట్టుపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతులకు రాయితీ గడ్డి కోత మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ మండల పరిధిలోని ఐదుగ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు అమలవుతున్న వాతావరణ మార్పులు స్థిర స్థాపక వ్యవసాయ కుటుంబాల అభివృద్ధి పథకం (ఆర్‌ఏహెచ్‌ యాక్టు) ద్వారా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆ ర్థిక పరిస్థితి మెరుగుపర్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలని సూచిం చా రు. పథకం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగనమోని కురుమయ్య, రైతుబంధు మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, వైస్‌ ఎంపీపీ చిన్నారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రాజ్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, ఎంపీడీవో రాంమోహ్మన్‌, ఏడీఏ రమేష్‌బాబు, ఏవో నీతి, సర్పంచులు వంగ సుదర్శన్‌గౌడ్‌, జంగం వెంకటయ్య, అమృత్‌రెడ్డి, ఆశోక్‌, నాగ రాజు, వంశీ, గోపినాయక్‌, కృష్ణయ్య  పాల్గొన్నారు.

కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటా..

  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్‌ గిరిజన నాయకుడు, మాజీ సర్పంచ్‌ హన్మ్యనాయక్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని చిన్నపీరుతండా లో బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం కలిసి పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-08-04T04:52:31+05:30 IST