Abn logo
Nov 22 2020 @ 00:46AM

ఏపీఐఐసీ రికార్డుల నుంచి మిగుల భూములు తొలగించండి

మాకవరపాలెం, నవంబరు 21 : రాచపల్లి రెవెన్యూలో గల భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించాలని పలువురు రైతులు కోరుతున్నారు. అన్‌రాక్‌ కంపెనీ భూ సేకరణ సమయంలో రాచపల్లి రెవెన్యూలో మిగులు భూములు పదేళ్ల క్రితం  ఏపీఐఐసీ రికార్డుల్లో నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకో లేకపోతున్నామని రైతులు వాపోయారు.  సుమారు 150 ఎకరాల భూములు ఆన్‌లైన్‌ కాకపోవడంతో రైతు భరోసాతో పాటు పిల్లల చదువులకు రుణాలు కోల్పోతున్నామన్నారు. గ్రామ సభల్లో ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించినా ఫలితం లేకపోతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించాలని విన్నవించారు.

 .

Advertisement
Advertisement
Advertisement